19.12.09

అనిత ఓ అనితా

Posted by patlolla

నా ప్రాణమా నను విడిపోకుమా నీ ప్రేమ లో నను కరగనీకుమా
పదే పదే నా మనసు నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది
అనిత.. అనితా.... అనిత ఓ వనిత నా అందమైన అనిత ..
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన

నా ప్రాణమా నను విడిపోకుమా నీ ప్రేమ లో నను కరగనీకుమా

నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా
కలలో కూడా నీరూపం నను కలవరపరచేనే కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే
నువ్వుఒకచోట నేనుఒకచోట నినుచుడకుండానే క్షనముండలేనుగా
నా పాటకు ప్రాణం నివే నా రేపటి స్వప్నం నివే నా ఆశాలరాణివి నివే నా గుండె కు గాయం చేయకే
అనిత.. అనితా.... అనిత ఓ వనిత నా అందమైన అనిత ..
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన

నా ప్రాణమా నను విడిపోకుమా నీ ప్రేమ లో నను కరగనీకుమా.........

నువ్వే నాదేవతవి ఎదలో కొలవుంచా ప్రతిక్షణం ధ్యానిస్తూ పసిపాపగా చూస్తా
విసుగురాని నీ హృదయం నీ పిలుపుకై ఎదురుచూసే నిను పొందని ఈ జన్మే నాకెందుకు అన్తోందే
కరునిస్తావో కటేస్తావో నువ్వు కదాని అంటే నే శిలానవుతనే
నను విడని నీడవు నివే ప్రతి జన్మ కు తోడువు నివే
నా కమ్మని కలని కూల్చి నను ఒంటరివాడ్ని చేయకే
అనిత.. అనితా.... అనిత ఓ వనిత నా అందమైన అనిత ..
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన

నా ప్రాణమా నను విడిపోకుమా నీ ప్రేమ లో నను కరగనీకుమా.........
పదే పదే నా మనసు నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది
అనిత.. అనితా.... అనిత ఓ వనిత నా అందమైన అనిత ..
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ఏదోరోజు నా పైన నీ ప్రేమ కలుగుతుందని
ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కదాని అన్నా
ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి
గువరకు ప్రేమిస్తూనే ఉంటా
అనిత.. అనితా.... అనిత ఓ వనిత నా అందమైన అనిత ..
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ......................... ...................

0 comments: